ఈతరం భారతం ఓవర్సీస్ న్యూస్ జూన్ 21
హోర్మూజ్ జలసంధిని క్లోజ్ చేసిన ఇరాన్!అమెరికా, ఇజ్రాయెల్‌పై ఇరాన్ మండిపడింది.నియమాలు ఉల్లంఘించారని ఆరోపించింది.కోపంతో హోర్మూజ్ జలసంధిని మూసేసింది.ఇజ్రాయెల్, హిజ్బొల్లా మళ్లీ దాడులకు తెగబడ్డాయి.వీరి మధ్య కుదిరిన సంధి గంటల వ్యవధిలో చెడిపోయింది.పైగా పరస్పరం నిందించుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.హిజ్బొల్లా 50కి పైగా మిస్సైల్స్ ప్రయోగించిందని ఇజ్రాయెల్ అంటోంది.మరోవైపు, దక్షిణ లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ ఆపలేదని ఇరాన్ చెబుతోంది.అయితే, ఈ మొత్తం ఎఫెక్ట్ ఇప్పుడు స్విట్జర్లాండ్‌పై పడింది.ఆ దేశంలో జరగబోయే తదుపరి శాంతి చర్చలపై పడింది.
ఇజ్రాయెల్‌కు నేనంటే గౌరవం, నా మాట నెతన్యాహు వింటాడు, ఈ శాంతి చర్చలను కాపాడగలిగేది నేను ఒక్కడినే అంటూ, ట్రంప్ ధీమా వ్యక్తం చేసిన ఒక్కరోజులోనే మిడిల్ ఈస్ట్ మళ్లీ రణరంగంగా మారింది.ప్రస్తుతం శాంతి చర్చలు పూర్తిగా రద్దుకాలేదు.















