ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 21
హైదరాబాద్ నగరంలో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే వారికి జీహెచ్ఎంసీ గట్టి షాక్ ఇచ్చింది. నగరంలోని ఖాళీ స్థలాలను డంపింగ్ యార్డులుగా మారుస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోనుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏకంగా ₹2 లక్షల వరకు జరిమానా, అవసరమైతే జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించింది.ఐకియా సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో భారీగా పేరుకుపోయిన వ్యర్థాలే ఈ నిర్ణయానికి కారణమయ్యాయి..















