EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆర్థిక అసమానతలతోనే విదేశాల్లో పెరుగుతున్న భారతీయ కార్మికులు.. రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వరమే చొరవ చూపాలి             బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్  

ఆర్థిక అసమానతలతోనే విదేశాల్లో పెరుగుతున్న భారతీయ కార్మికులు..

రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సత్వరమే చొరవ చూపాలి

                          బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్

హైదరాబాద్ జూలై 21 (ఈతరం భారతం);ఇటీవల ముఖ్యమంత్రి గల్ఫ్ కార్మిక నాయకులతో సమీక్షను నిర్వహించి ప్రకటించిన హామీలను రాబోయే రాష్ట్ర బడ్జెట్లో చేర్చి నిధులు కేటాయించాలని గల్ఫ్ జేఏసీ చైర్మన్ మంద భీమ్ రెడ్డి నేతృత్వంలో నిర్వహించిన ముఖ్యనాయకుల సమావేశానికి బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఆత్మీయ అతిథిగా పాల్గొన్నారు.. ఈ సమావేశంలో దాసు సురేశ్ మాట్లాడుతూ గడచిన 7 నెలల వ్యవధిలో 100 మంది గల్ఫ్ కార్మికుల మృతదేహాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన విషయాన్ని ప్రభుత్వం గమనించి వారి కుటుంబాలను ఆదుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గల్ఫ్ నాయకులతో ఇటీవల సమావేశమవ్వడం శుభపరిణామమని త్వరలోనే గల్ఫ్ కార్మికుల సమస్యకు శాశ్వత పరిష్కారం ముఖ్యమంత్రి చూపిస్తారని ఆశాభావం వ్యక్తం చేసారు .. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విధంగా 5 లక్షల జీవితభీమా, గల్ఫ్ కాల్ సెంటర్,సంక్షేమ నిధికి అవసరమైన 500 కోట్లకు త్వరలో ప్రవేశపెట్టే రాష్ట్ర బడ్జెట్లో పొందుపరచాలన్నారు..దేశంలో ఆర్థిక అసమానతలు, కొంతమంది చేతిలోనే సంపద కేంద్రీకరణ, సంపన్నులకు టాక్స్ వరాలు , పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన వల్లనే భారతదేశంలో బిలీనియర్ల సంఖ్య 173 కు పెరిగిందన్నారు.. బ్రిటిష్ పరిపాలనలో 1 శాతం సంపన్నుల వద్ద ఉన్న దేశ ఆదాయం 21 శాతాన్ని మించి నేడు 1 శాతం సంపన్నుల వద్ద 22.6 శాతం సంపద పెరిగి విదేశీ పరిపాలనను మించి నేడు స్వపరిపాలనలో ఆర్థిక అసమానతలు పెచ్చరిల్లుతున్నాయని మండిపడ్డారు..ఉన్నత వర్గాలలోని 10 శాతం జనాభావద్ద 73 శాతం సంపద పేరుకుపోయి 80 శాతం ఉన్న అత్యధిక వర్గాల ప్రజల వద్ద కేవలం 4.3 సంపద మాత్రమే నిలువ ఉన్నదని దాసు సురేశ్ ఆవేదన వ్యక్తం చేసారు.. ఈ ఆర్ధిక అసమానతల వల్లనే ప్రవాస భారతీయులు, గల్ఫ్ కార్మికుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుందన్నారు..ప్రపంచవ్యాప్తంగా 3.2 కోట్ల మంది భారతీయులు 152 దేశాలలో విస్తరించి దేశానికి ప్రతియేటా 10 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని సమకూరుస్తున్నారన్నారు. ఇందులో కోటి మంది కేవలం గల్ఫ్ లోనే ఉంటూ 4 లక్షల కోట్ల రూపాయలను దేశానికి పంపిస్తున్న విషయాన్ని గుర్తించి వారి సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత కల్పించాలన్నారు.. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం ఏ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసినా దాని ప్రభావం భారతదేశం పై పడకపోవడానికి మన దేశానికి ఉన్న బలమైన విదేశీ మారక ద్రవ్య వ్యవస్థ,ఎన్నారై వనరులే అని విషయాన్ని ప్రభుత్వాలు గుర్తెరిగి ప్రవాస భారతీయుల కష్టాలను కడతేర్చాలని దాసు సురేష్ ప్రభుత్వాలను కోరారు ..

Related News

Select the Topic
Scroll to Top