EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారు

ఉద్యోగాలు రాక ఆడ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటే అవహేళన చేస్తున్నారు

* కేసీఆర్ మరో సారి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు

* కేటీఆర్, తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి

* సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం నాంపల్లి దర్గా నో, బిర్లా మందిర్ వద్దో బిచ్చము అడుక్కునేది

* గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి

* పదేళ్లలో ఫామ్ హౌజ్ లు కట్టుకున్న చరిత్ర..కెసిఆర్ కుటుంబానిది   

* పెద్దపల్లి కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి

 

పెద్దపల్లి.  జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు పాల్గొన్నారు.పెద్దపల్లి కాంగ్రెస్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. “ఏమిచ్చినా, ఎంత చేసినా కాంగ్రెస్ కార్యకర్తల రుణం తీర్చు కోలేనిది. ప్రజలను నట్టేట ముంచిన కేసీఆర్. మూడో సారి ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నారు. ఇవాళ లక్ష కోట్లు, వేలాది ఎకరాల భూములు ఎక్కడి నుంచి వచ్చాయో కేసీఆర్ చెప్పాలి. రాహుల్ గాంధీ ఎవరూ అడుగుతున్న సన్నాసి కేటీఆర్. ఆ కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలి. గాంధీ కుటుంబానికి ఉండటానికి ఇళ్ళు లేని పరిస్థితి ఉంటే, పదేళ్లలో ఫామ్ హౌజ్ లు కట్టుకున్న చరిత్ర..ఇంత బలుపు ఎందుకు కేటీఆర్, తెలంగాణ రాకుంటే అమెరికాలో బాత్ రూమ్‌లు కడుక్కుని బతికేవాడివి.” అని రేవంత్ రెడ్డి విమర్శించారు.పెద్ద పల్లి కాంగ్రెస్ సభలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనే కరీంనగర్ సస్యశ్యామలం అయిందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని వి

మర్శించారు 

Related News

Select the Topic
Scroll to Top