EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎస్సీ వర్గీకరణ పేరుతో ద్రోహం చేస్తున్న మంద కృష్ణ      దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.డా.గాలి వినోద్ కుమార్ వర్గీకరణ సాధనే ఏకైక లక్ష్యంగా మాదిగలు ఉద్యమించాలని  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య పిలుపు 

ఎస్సీ వర్గీకరణ పేరుతో ద్రోహం చేస్తున్న మంద కృష్ణ

      దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.డా.గాలి వినోద్ కుమార్

 వర్గీకరణ సాధనే ఏకైక లక్ష్యంగా మాదిగలు ఉద్యమించాలని

 ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య పిలుపు

హైదరాబాద్ జూలై 18 (ఈతరం భారతం);: ఎస్సీ వర్గీకరణ పేరుతో మందకృష్ణ మాదిగ గత 30 సం.లుగా మాదిగలకు ద్రోహం చేస్తున్నారని దక్షిణ భారత రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ. డా. గాలి వినోద్ కుమార్ ఆరోపించారు. గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్టికల్ 371-డీ ద్వారా వర్గీకరణ సాధ్యమని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రకటించారన్నారు. ఈ విషయాన్ని తాము స్వాగతిస్తున్నామని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు 371-డీ విషయంపై ప్రధాన మంత్రికి లేఖలు రాయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ గత మూడు దశాబ్ధాలుగా వర్గీకరణ సాధ్యం కాకపోవడంతో మాదిగలు అన్ని రంగాలలో తీవ్రంగా నష్ట పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నూతన ప్రజాస్వామిక ఎమ్మార్పీఎస్ నిర్మిద్దామని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ గత పది సంవత్సరాలుగా అధికారంలో ఉండి కూడా వర్గీకరణ చేయడకుండా అణిచివేసిందని విమర్శించారు. వర్గీకరణ సాధనే ఏకైక లక్ష్యంగా మాదిగలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇందుకు గాను త్వరలో ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. ఈ సదస్సులో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో-ఆర్డినేటర్ మాతంగి ఓదేలు మాదిగ, విజయ్ మాదిగ, రాజుమాదిగ, బీంలింగం మాదిగ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top