కరీంనగర్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు
కరీంనగర్, అక్టోబర్ 14 (ఈతరం ఇండియా న్యూస్) : కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు శనివారం రాత్రి ఎంతో వైభవంగా జరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాలు, గ్రామాలలోని ప్రధాన కేంద్రాలలో బతుకమ్మలను పెట్టి ప్రకృతి పూల, గౌరి పూజల అనంతరం ఉయ్యాల పాటలు పాడుతూ ఆటలు ఆడారు. సంప్రదాయరీతిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరిగిన అనంతరం నీటిలో నిమజ్జనం జరిపి వాయనాలను ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మ వేడుకలు చూసేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు, యువతీయువకులు తరలివచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి.

a














