కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనటానికి మంచిర్యాల వెళ్లిన బీ సీ కులాల నాయకులు
ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంఛార్జి నలుబోల మధు శ్రీ 2.9.24
మంచిర్యాల జిల్లా బీసీ సంఘం తరఫున కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొనటానికి జన్నారం మండలం నుండి నాలుగు వాహనాలలో సుమారు 25 మంది బీ సీ కులాల నాయకులు మంచిర్యాలకు తరలి వెళ్లారు.స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు తప్పనిసరిగా కల్పించాలని డిమాండ్తో కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వనున్నట్టుగా మంచిర్యాల జిల్లా బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం కన్వీనర్ తాడేపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు .ఈ కార్యక్రమంలో బీసీ కులాల నాయకులు పాల్గొన్నారు.














