కాంగ్రెస్ మేనిఫెస్టో కాపీ కొట్టారంటూ కేసీఆర్పై పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.”కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు ఎలా ఇస్తారని అడిగారు. ఇప్పుడు కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టో ఎలా అమలు చేస్తారు. లక్ష కోట్ల మీ అక్రమ సంపాదనలో తీసి ఖర్చుపెడతారా. తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా మార్చి దోచుకుంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం రాగానే దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. త్వరలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తాం.” అని పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు.ఖమ్మం జిల్లా: పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో మీడియాతో తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు.”కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. నాకోసం కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కృతజ్ఞతలు. మీరంతా న్యాయం ధర్మం పక్షాన నిలచినందుకు సంతోషంగా ఉంది.” అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.