ఘనంగా దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయతి వేడుకలు
08-07-2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ప్రియతమ దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి 75 వ జయతి వేడుకలు ఘనంగా నిర్వహించి,ఘన నివాళులు అర్పించిన ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ సబ్యులు రామదహాయం రఘురామిరెడ్డి గారు.ముందుగా పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి గారు, TPCC ఉపాధ్యక్షులు మాజి శాసన మండలి సభ్యులు పోట్ల నాగేశ్వరరావు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారం లోకి తీసుకొచ్చి, ఆదర్శ గ్రామాల ద్వారా, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రేషన్ కార్డులు ఇంటింటికి సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేశారు, అలాగే రైతాంగానికి ఉచిత కరెంటు, ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు, వడ్డీ లేని రుణాలు, ఫీజు రీయింబర్స్మెంట్, రాజీవ్ ఆరోగ్యశ్రీ, అనేక సంక్షేమ పథకాలు పేదవారికి లబ్ధి పొందాల పరిపాలన చేశారని అందుకే నేటి వరకు ప్రతి ఒక్కరి హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచారని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జిల్లా మాజి రైతు సమన్వయ కమిటీ అద్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా, INTUC,OBC, కిసాన్,సేవాదళ్ , మైనారిటీ అద్యక్షులు దొబ్బల సౌజన్య, కొత్తా సీతారాములు, పుచ్చకాయల వీరభద్రం, మొక్కా శేఖర్ గౌడ్,సయ్యద్ గౌస్, సయ్యద్ ముజాహిద్ హుస్సేన్,కార్పొరేటర్లు మలీదు వేంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్, రాపర్తి శరత్,పల్లెబోయినభారతి చంద్రం, నగర ST,INTUC, OBC, మైనారిటీ అద్యక్షులు శంకర్ నాయక్, నరాల నరేష్, బాణాల లక్ష్మణ్, షేక్ అబ్బాస్ భేగ్, జిల్లా OBC సెల్ ఉపాద్యక్షులు గజ్జెల్లి వెంకన్న, బొమ్మి డి శ్రీనివాస్ యాదవ్, గజ్జి సూర్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు మద్ది వీరారెడ్డి,జిల్లా INTUC వర్కింగ్ ప్రెసిడెంట్ Md Y పాషా, మాజి కౌన్సిలర్ బెడద సత్యనారాయణ,అబ్దుల్ రహమాన్, మహమోద్, వాసిమ్, బీరెడ్డి రమేష్, కరిమెల భద్రం, శ్రీశైలం, డి వెంకటరావు,ఫరీద్ ఖాద్రి, జెరిపోతుల ఆంజని కుమార్, బచ్చలికూర నాగరాజు, యడవల్లి నాగరాజు, రజి భాయ్, జహీర్ భాయ్, తిరుమలశెట్టి జయప్రకాష్, కాళంగి కనకరాజు, ఫజల్,భూక్యా సురేష్ నాయక్, INTUC AC మెకానిక్ సంఘ అద్యక్షులు కొంగర సంగయ్య, ఉన్నం రాజశేఖర్, నగేష్, పర్వత శ్రీను, కొలుపొంగు రమేష్, సట్టు వేంకటేశ్వర్లు, తుపాకుల వెంకన్న, పాషా, మాజి సేవాదళ్ మహిళా అద్యక్షురాలు చిత్రవరపు నారాయణమ్మ, ప్రతిభారెడ్డి, దమయంతి, స్వరూప, భవాని, తూములూరి నరసింహరావు,తదితర నాయకులు పాల్గొన్నారు.














