EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు   తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు

ఘనంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు

తండోపతండాలుగా తరలివచ్చిన భక్తులు

ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్ జూలై 9 (ఈతరం భారతం);: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. కల్యాణ మహోత్సవానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. అమ్మవారికి ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారిని 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. బల్కంపేట ఎల్లమ్మను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మీ, రాజకీయ నేతలు దర్శించుకున్నారు. పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పొన్నానికి స్వాగతం పలికే సమయంలో స్వల్పంగా తోపులాట జరిగింది. దీంతో ప్రొటోకాల్ పాటించకపోవడంతో పొన్నం అలకబూనారు. కలెక్టర్ అనుదీప్‌కు పొన్నం ప్రభాకర్ ఫోన్ చేసి అసహనం వ్యక్తం చేశారు.

 

Related News

Select the Topic
Scroll to Top