నగరంలో చందానగర్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో నిందితుల దగ్గరి నుంచి పోలీసులు భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా భారీగా బంగారం పట్టుకున్నారు. దాదాపు 29 కేజీల బంగారం, 26 కేజీల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంగారంలో నిన్న రాత్రి వాహనాలను తనిఖీ చేస్తుండగా కారులో ఆభరణాలు పట్టుబడ్డాయి. చందానగర్ పరిధిలోని మలబార్, కళ్యాణ్, లలిత, రిలయన్స్ రిటైల్, విరాజ్ జ్యువలర్స్ షాపులకు సంబంధించినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి ముంబయి, కేరళ రాష్ట్రాలకు తరలిస్తున్న బంగారాన్ని నిందితులు దగ్గరి నుంచి పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు