రేవంత్ ఓ దౌర్భాగ్యుడు!
కేటీఆర్‌తో భేటీ తర్వాత పొన్నాల మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. ‘‘రాజకీయాల్లో పదవులు కో-ఆర్డినేషన్ కోసం మాత్రమే. రేవంత్ లాంటి దౌర్భాగుడి గురించి నేను మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లాంటి వాళ్లు భ్రష్టు పట్టిస్తున్నారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చాక అయన ఎమ్మెల్యే గా ఎందుకు గెలవలేదు?, పార్టీలో నేనొక్కడ్నే ఓటమి పాలయ్యానా?, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ భార్య ఓడిపోలేదా?, అవమానాన్ని భరించలేకే పార్టీని వీడా. బీఆర్ఎస్‌లో చేరాలని కేటీఆర్ నన్ను కోరారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని వివరాలు చెప్తా.’’ అని పొన్నాల పేర్కొన్నారు.
బంపరాఫర్ ఇదేనా..?
ఇదిలా ఉంటే.. జనగామ బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బీసీ నాయుకుడ్ని కలిసినట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది. పొన్నాల బీసీ నాయకుడు కావడం.. పైగా రాజకీయ అనుభవం కలిగిన నేత అయి ఉండడం బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశంగా భావిస్తోంది. పైగా గత కొద్ది రోజులుగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి-పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య సీటు పంచాయితీతో కేడర్ అయోమయానికి గురైంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయానికి ఎలాంటి తలనొప్పులు వస్తాయోనని గులాబీ పార్టీ అనుమానిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి గందరగోళం లేకుండా పొన్నాలకు సీటు ఇస్తే బాగుంటుందని బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. ఇదలా ఉంటే పొన్నాలను బీఆర్ఎస్‌లోకి రావాలని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆహ్వానించారు. మరి ఏం జరగబోతుందో వేచిచూడాలి















