ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుండి 115 మంది అసెంబ్లీ అభ్యర్థులను మీరు ప్రకటించడం జరిగింది. మీరు ప్రకటించిన జాబితాలో సామాజిక న్యాయం లేదు పూర్తిగా బీసీలను రాజకీయంగా నిర్లక్ష్యం చేసి తక్కువ జనాభ కలిగిన రెండు మూడు అగ్రకులాలకే పెద్ద పీట వేశారు ఇంకా ప్రకటించని మిగత ఐదు అసెంబ్లీ స్థానాలలో మళ్ళీ అగ్రకులాలకే బీ ఫాములు ఇవ్వాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తుంది ఇది చాలా అన్యాయం, జనాభా దామాషా ప్రకారం బీసీలకు బి ఫామ్ లు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేసారు.ఈ మేరకు శుక్రవారం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు లేఖ రాసారు.శుక్రవారం సంఘం కార్యాలయం లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మీరు గతంలో అనేకమార్లు చెప్పినట్టుగా టిఆర్ఎస్ పార్టీ రాజ్యాంగంలోనే బలహీనవర్గాలకు 50 శాతం పదవులు ఇవ్వాలని వ్రాసుకున్నామని చెప్పిన విషయాన్ని ఇక్కడ మీకు గుర్తు చేసారూ.తెలంగాణ రాకముందు ఉన్నముఖాలే,నేడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడ అవే పాతముఖాలకు బి ఫామ్ లు ఇస్తున్నారు సాధించిన తెలంగాణలో కొత్తవారికి ముఖ్యంగా బీసీలకు,అలాగే యువకులకు టికెట్లు ఇవ్వకపోవడం చాలా అన్యాయం,గత 2014 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీసీలకు 28 టికెట్లు ఇచ్చి,మొన్న జరిగిన 2018 ఎన్నికల్లో 26 టికేట్లు ఇచ్చి, 2023 ఎన్నికలు వచ్చేసరికి 23 టికెట్లు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటన్నారు,బీసీలలో రోజురోజుకు రాజకీయ చైతన్యం పెరుగుతుంటే,మీరు మాత్రం టికెట్ల కేటాయింపులో మాత్రం రాజకీయ ప్రాధాన్యం తగ్గిస్తున్నారు ఇది ప్రజాస్వామ్య లక్షణం కాదన్నారు, అన్ని వర్గాలకు అన్ని కులాలకు దామాషా పద్ధతిన రాజకీయ అధికారం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి, పార్టీలకు గౌరవం దక్కుతుందన్నారు. కానీ మీరు ప్రకటించిన జాబితాను చూస్తే ఐదు శాతం జనాభా కలిగిన రెడ్డి సామాజిక వర్గానికి 40 అసెంబ్లీ స్థానాలు, అర శాతం ఉన్న వెలమ సామాజిక వర్గానికి 12 అసెంబ్లీ స్థానాలు, మొత్తంగా 10 శాతం ఉన్న అగ్రకులాలకు 61 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారు. ఇదే సమయంలో 60 శాతం జనాభా ఉన్న 136 కులాలు కలిగిన బీసీలకు కేవలం 23 టికెట్లు మాత్రమే కేటాయించి బీసీలను రాజకీయంగా చిన్న చూపు చూశారు, గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెడ్లు పాలకులుగా అత్యధిక శాతంగా ఉంటే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా వారికే మీరు రాజకీయంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. రాష్ట్ర క్యాబినెట్ లోనూ వారికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు ఏ రెడ్లను మీరు నమ్ముకొని వారిని భుజాల పైన మోస్తున్నారో, వారినే చూసి బీసీలను నిర్లక్ష్యం చేస్తున్నారో అదే రెడ్డి సామాజిక వర్గం బిఆర్ ఎస్ పార్టీ రాజకీయ పతనానికి కారణం అవుతుందనే విషయాన్ని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాము మీరు ప్రకటించిన 115 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికైనా మార్చి బీసీలకు ఈనెల 15వ తేదీన ఇవ్వనున్న బీఫామ్ లను బీసీ అభ్యర్థులకు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం, కాదు కూడదు ఇలాగే రెడ్డిలను నమ్మి బి ఫామ్ లు వారికి ఇస్తే ఈ అసేంబ్లి ఎన్నికల్లో మీ బిఆర్ఎస్ పార్టీ జాతకాన్ని మార్చడానికి రాష్ట్రంలోని రెండున్నర కోట్ల మంది బిసి లు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కుల్కచర్ల శ్రీనివాస్, జాజుల లింగం గౌడ్, వరికుప్పల మదు, గూడూరు భాస్కర్ , నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు