EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జోగులాంబ గద్వాల జిల్లా లో రిజర్వాయర్ల పరిస్థితి అధ్వాన్నం

 జోగులాంబ గద్వాల జిల్లా లో రిజర్వాయర్ల పరిస్థితి అధ్వాన్నం

గద్వాల ఆగష్టు 30 (ఈతరం భారతం);జోగులాంబ గద్వాల జిల్లా లో రిజర్వాయర్ల పరిస్థితి  ఘోరంగా తయారైందని జోగులాంబ గద్వాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తట్టే మహేష్ విమర్శించారు.నేడిక్కడ మీడియా సమావ్రేశ్జం లో మాట్లాడుతూ నాలుగు రిజర్వాయర్లను పట్టించుకునే నాధుడే లేడని అన్నారు. ర్యాలంపాడు మరియు ముచ్చోని పల్లి రిజర్వాయర్ మరియు తాటికుంట రిజర్వాయర్ నాగర్ దొడ్డి రిజర్వాయర్ రాజకీయ నాయకులు రిజర్వాయర్ అధికారులు ఈ ప్రాజెక్టుల మీద దృష్టి పెడితే రైతులు బాగుపడతారన్నారు. దేశంలో డ్యాములన్నీ గేట్లు తెరిచి నీటిని దిగువకి విడుచుచున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా లో మాత్రం నాగర్ దొడ్డి డ్యాం, ముచ్చోనిపల్లి డ్యాము తాటికుంట లకునీటి లభ్యత అరకొర అంతంత మాత్రమే ఉందని అన్నారు.రాబోయే కాలంలో రైతులకు నీటి లభ్యత క్లిష్ట పరిస్థితులే కనబడుతున్నది. అధికారులు సాధ్యమైనంత త్వరగా ఈ డ్యాములకు నీటితో నింపాలని ఆయన అధికాకులను కోరారు. లేని యడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top