యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఎల్లంబావి గ్రామం జ్యోతినగర్ లోనిశ్రీ శివభక్త మార్కండేయ పూజిత శివాలయంలో అక్టోబర్ 15 నుండి 23 అక్టోబర్ వరకు దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థాన కమిటీ అధ్యక్షులు కర్నాటి నారాయణ , ప్రధాన కార్యదర్శి మేకల బాల నర్సింహ లు ఒక ప్రకటనలో తెలిపారు.ప్రతిరోజు ఆలయంలో ఉదయం సాయంత్రం అమ్మవారికి పట్టు వస్త్ర పూజ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలు విజయవంతం చేయాలని కోరారు