EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

టిజిఎస్ ఆర్‌టిసి బస్సులో గర్భిణికి డెలివరీ

టిజిఎస్ ఆర్‌టిసి బస్సులో గర్భిణికి డెలివరీ

పురుడు పోసిన మహిళా కండక్టర్ భారతి

కండక్టర్ భారతిని అభినందించిన తెలంగాణ ఆర్‌టిసి ఎండి సజ్జనార్

హైదరాబాద్ ఆగష్టు 19 (ఈతరం భారతం);రక్షాబంధన్ సందర్భంగా బస్సులో గర్భిణీకి పురుడు పోసిన మహిళా కండక్టర్ భారతిని తెలంగాణ ఆర్‌టిసి ఎండి సజ్జనార్ అభినందించారు. ‘రాఖీ పండుగ నాడు టిజిఎస్ ఆర్‌టిసి బస్సులో గర్భిణికి డెలివరీ చేసి ఒక మహిళా కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. తాను విధులు నిర్వర్తిస్తోన్న బస్సులో గర్భిణికి పురిటి నొప్పులు రాగా, ఆమె వెంటనే స్పందించి బస్సులో ప్రయాణిస్తోన్న నర్సుతో కలిసి ప్రసవం చేశారు. అనంతరం తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అని ఎండి సజ్జనార్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గద్వాల డిపోకు చెందిన గద్వాల- వనపర్తి రూట్ పల్లె వెలుగు బస్సులో సోమవారం ఉదయం సంధ్య అనే గర్భిణి రక్షాబంధనన్ సందర్భంగా తన సోదరులకు రాఖీ కట్టేందుకు వనపర్తికి వెళ్తున్నారు. బస్సు నాచహల్లి సమీపంలోకి రాగానే గర్బిణికి ఒక్కసారిగా పురిటినొప్పులు వచ్చాయి.వెంటనే అప్రమత్తమైన మహిళా కండక్టర్ జి.భారతి బస్సును ఆపించారు. అదే బస్సులో ప్రయాణిస్తోన్న ఒక నర్సు సాయంతో గర్భిణికి పురుడు పోశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం 108 సాయంతో తల్లీబిడ్డను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. రక్షాబంధన్ నాడు బస్సులో గర్భిణికి పురుడు పోసిన కండక్టర్ భారతికి ఆర్‌టిసి యాజమాన్యం తరపున అభినందనలు. తాను సమయస్పూర్తితో వ్యవహారించి నర్సు సాయంతో సకాలంలో పురుడుపోయడం వల్లే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చుతూనే, సామాజిక బాధ్యతగా సేవాస్ఫూర్తిని ఆర్‌టిసి ఉద్యోగులు చాటుతుండటం గొప్ప విషయం’ అని సజ్జనార్ పేర్కొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top