తపస్య డిగ్రీ కళాశాల దిల్ సుక్ నగర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలకు గౌరవ అతిథిగా హైదరాబాద్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి , మరియు రెడ్ క్రాస్ సబ్యులు , జ్యోతి యాదవ్, కల్పన దత్త, రూప పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో బ్రాంచ్ హెడ్ వెంకట్‌రెడ్డి, DSNR, ఆపరేషన్స్ హెడ్ శ్రీధర్ రాజు మరియు ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, R. అంబికా BBA ఇంచార్జి పర్యవేక్షణలో ఉత్సాహంగా జరిగింది.రెడ్‌క్రాస్ ఛైర్మన్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ బతుకమ్మ సంస్కృతి, సంప్రదాయాలపై విద్యార్థులను చైతన్యపరిచారు.విద్యార్థులు బతుకమ్మ ఆడుతూ ఉత్సాహంగా పాల్గొనడంతో పాటు కార్యక్రమాన్ని తిలకించారు.