పాపనాశం ఫారెస్ట్ టోల్గేట్ వద్ద అక్రమ వసూళ్లు
19.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
శ్రీవారి భక్తులను నిలువు దోపిడీ చేస్తున్న పాపనాశం టోల్ సిబ్బంది. సీరియల్ నెంబర్ లేని స్లిప్పులు ఇస్తూ ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారు. 50 రూపాయల టోల్ రుసుమును 40 రూపాయలు తీసుకొని టోల్ స్లిప్పులు ఇవ్వకుండా వాహనాలను అనుమతిస్తున్నారు.
19-07-2024 తేదీలో తీసుకున్న టోల్ స్లిప్ లో 19-15-2024 తేదీతో స్లిప్ ఇచ్చారు .
15వ నెలతో టోల్ స్లిప్పులు జారీ చేస్తున్న పాపనాశం ఫారెస్ట్ సిబ్బంది.ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు














