ప్రకృతి పూల పండుగ బతుకమ్మ అని, తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ బతుకమ్మ అని ఆరోగ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆరోగ్య జ్యోతి అన్నారు. నేడు బోధన్ ఆర్టీసీ కాలనీ యందు జరిగిన బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న అనంతరం ఆవిడ మాట్లాడుతూ పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని, బతుకమ్మ పండుగ ఎంతో విశిష్టత ఉన్నదని, ఈ విశిష్టతను పండుగ, సంస్కృతి సంప్రదాయాన్ని పిల్లలకు వివరించి పాటలను నేర్పించాలని ఆమె సూచించారు. తంగేడు పువ్వును రాష్ట్ర పువ్వు గా గుర్తించడం గర్వ కారణమని ఆరోగ్య జ్యోతి అన్నారు. ఈ కార్యక్రమమునకు ఆర్టీసీ కాలనీలోని మహిళలు తదితరులు పాల్గొన్నారు.















