అంబర్పేట్ నియోజకవర్గంలో గణనీయమైన పురోభివృద్ధిని సాధించి అన్ని రంగాల్లో తీర్చి దిద్దామని అనేక ప్రజా సమస్యలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి సహకారంతో అభివృద్ధి దిశగా మంచి ఘనకీర్తి సాధించామని వచ్చే ఎన్నికల్లో తన గెలుపుకు ఇవే బాటలు కానున్నాయని ఆయన అన్నారు కెసిఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలే మరోసారి అంబర్పేట్ లో తనకు పట్టం కడతాయని అందరి ఆశీర్వాదంతో తాను మంచి మెజారిటీ సాధిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
*సెంటిమెంట్ పాదయాత్ర *
సోమవారం ఉదయము ఆయన రామంతపూర్ వద్ద విశాల్ మార్కెట్ వద్ద తన పాదయాత్ర ప్రారంభించి శ్రీ రమణ చౌరస్తా చే నెంబర్ చౌరస్తాల మీదుగా తన పాదయాత్ర కొనసాగించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించానని అదే సెంటిమెంట్ గా ఈరోజు ఇక్కడనుంచి యాత్ర ప్రారంభిస్తున్నాను అని ఆయన అన్నారు. ఈ పాదయాత్రలో ఆయన వెంట అంబర్ పేట కార్పొరేటర్ విజయకుమార్ గౌడ్, బాగ్ అంబర్పేట కార్పొరేటర్ శ్రీమతి పద్మ వెంకటరెడ్డి సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గ ఐదు డివిజన్ల పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ సిద్ధార్థ ముదిరాజ్ మేడి ప్రసాద్, భీష్మ,కొమ్ము శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ పద్మా వెంకటేష్ సీనియర్ పార్టీ నాయకులు లవంగు ఆంజనేయులు మల్లేష్ యాదవ్ దయాకర్ యాదవ్ రామారావు నరసింహారెడ్డి, శ్రీరాములు ముదిరాజ్ లింగారావు దిలీప్ అరుణ్ దాత్రిక ధర్మరాజు ఆమనూరు సతీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు














