EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బాలికల సంరక్షణ సమాన అవకాశాల కల్పన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత

దృష్టికి రాకుండా లోలోపలే గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న బాల్య వివాహాల సంఖ్య దేశంలో ఎక్కువగా ఉంది. చాలామంది అధికారులు ఇతరుల ఒత్తిడితో తాత్కాలికంగా పెళ్లిళ్లకు బ్రేక్ వేసిన సమయం చూసుకొని ఎవరికీ తెలియకుండా ఆ తంతు పూర్తి చేస్తున్నారు.

 

సర్వేలో వెళ్లడైన వాస్తవాలు:

 

 ఆరేళ్లలోపు వయసు గల బాల బాలికల నిష్పత్తి గడిచిన 10 15 నెలలో ఘనంగా తగ్గిపోయింది. ప్రస్తుతం ప్రతి 1,000 మంది బాలురపు కేవలం 914 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ప్రతి ముగ్గురు ఆడ శిశువుల్లో ఒకరు ఏడాదిలోకి మృతి చెందుతున్నారు. అలాగే ప్రతి నలుగురిలో ఒకరు 15 నెలలోపు మృతి చెందుతున్నారు. ప్రతి ఐదుగురిలో ఇద్దరు బాలికలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ప్రతి పదిమంది బాలికల్లో ఏడుగురు పదవ తరగతి పూర్తికాకుండానే చదువు మానేస్తున్నారు. ప్రతి పదిమందిలో ఆరుగురికి బాల్య వివాహాలు జరుగుతున్నాయి. వారిలో నలుగురు 18 ఏళ్లలో తల్లులవుతున్నారు.

 

చట్టాలు ఎన్ని ఉన్నా సమాజంలో మార్పు రావాలి సాయి చౌదరి:

 

 బాలికలపై జరుగుతున్న లైంగిక దాడులు, అకృత్యాలను నివారించడానికి నిర్భయ లాంటి కఠినమైన చట్టాలు ఎన్నో అమలులో ఉన్నప్పటికీ తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో ఆడపిల్లల పట్ల వ్యక్తుల ఆలోచన దృక్పథము, ప్రవర్తన తీరులో మార్పు వస్తేనే వీటిని పూర్తిగా నిర్మూలించగలము. దేశం అన్ని రంగాల్లో శరవేగముగా అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నప్పటికీ బాలిక సాధికారతను సాధించడంలో ఇంకా వెనుకబడే ఉందని అంగీకరించక తప్పదని జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ సాయి చౌదరి తెలిపారు

Related News

Select the Topic
Scroll to Top