తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆసరా పెన్షన్లు, రైతుబంధు డబ్బుల పెంపుతో పాటు మహిళల కోసం ప్రత్యేక స్కీమ్లు ప్రకటించారు. అర్హులైన మహిళలకు నెలనెలా భృతి అందిస్తామని ప్రకటించారు. అలాగే పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు.















