EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులివ్వాలి    బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవీలత డిమాండ్ 

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు నిధులివ్వాలి

   బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవీలత డిమాండ్

హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం) : కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని బీజేపీ రాష్ట్ర నాయకురాలు మాధవి లత ఆరోపించారు. అదికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ను ఇంతవరకు పునరుద్ధరించ లేదని ఆరోపించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు క్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. శనివారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీజేపీ ఎండో మెంట్ సెల్ ఆధ్వర్యంలో బ్రాహ్మణుల సంక్షేమంపై సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన మాధవీ లత మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వివేకానంద విదేశీ విద్యా పథకం పూర్తిగా కుంటుపడి పోయిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమకేమి పట్టనట్లు వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. చాలా మంది బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకు వెళ్లారని, అయితే కేవలం ఒక్క ఏడాది మాత్రమే రీయంబర్స్మెంట్ నిధులు విడుదల చేశారన్నారు. దీని వల్ల విద్యార్థులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. బీజేపీ ఎండోమెంట్ సెల్ కన్వీనర్ సూర్యప్రకాష్ అన్నవజ్ఞుల మాట్లాడుతూ బ్రాహ్మణ పరిషత్ కు ప్రభుత్వం నిదులు కేటాయించక పోతే త్వరలో ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎండోమెంట్ సెల్ నాయకులు నిరంజన్ దేశాయ్, నారాయణం చక్రవర్తులు, చింతపల్లి పణిభూషన్, కైలాష్, వల్లీనాద్ నాగేష్ బాబు, అర్పిత, లోకావాణి, రామసుధాకర్ శర్మ, బీజేపీ నేతలు ఎస్వీ సుభాష్, అమర్ నాథ్, గీతామూర్తి, కార్పొరేటర్ శ్రావణ్, బ్రాహ్మణ సంఘాల నాయకులు వంగపతి రావు, వెల్లాల రాంమోహన్, టీంసేనమూర్తి, దర్శనం శర్మ, నందిరాజు లక్ష్మీనారాయణ, ఎం.రాఘవరావు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top