EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

భువనగిరి ని అన్ని రంగాల్లో తీర్చి దిద్దుతాం: సీఎం కేసీఆర్

 

యాదాద్రి భువ‌న‌గిరి, అక్టోబ‌ర్ 16 (ఈత‌రం ఇండియా న్యూస్) : భువ‌న‌గిరిని ఐటీ హ‌బ్ కేంద్రంగా రూపొందించ‌డ‌మే కాకుండా ఇండ‌స్ర్టీయ‌ల్ పార్క్‌గా అభివృద్ధి ప‌ర‌చ‌డ‌మే భ‌విష్య‌త్తులో ల‌క్ష్య‌మ‌ని బిఆర్ఎస్ అధినేత, సిఎం కేసిఆర్ చెప్పారు. భువ‌న‌గిరి జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల గ్రౌండ్స్‌లో సోమ‌వారం సాయంత్రం బిఆర్ఎస్ అభ్య‌ర్థి ఫైళ్ళ శేఖ‌ర్‌రెడ్డి గెలుపు కోసం నిర్వ‌హించిన ప్ర‌జాశీర్వాద స‌భ‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా హాజ‌రై మాట్లాడారు. ఓట‌ర్‌లు ఆలోచించి ఓటు వేయాల‌ని అప్పుడే అవి భ‌విష్య‌త్తుకు మెట్టు అవుతుంద‌ని తెలిపారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే క‌ష్టాల‌ను కొనితెచ్చుకోవ‌డ‌మే అవుతుంద‌ని చెప్పారు. ప్ర‌జ‌ల క‌ష్టాలు తెల‌వ‌ని పార్టీల నేత‌లు చెప్పే మాయ‌మాట‌ల‌కు హైరానా ప‌డి ఓటు వేస్తే భ‌విష్య‌త్తు చీక‌టిమ‌య‌మైపోతుంద‌ని తెలిపారు. బిఆర్ఎస్‌కు మ‌ద్ద‌తుగా నిలిచి పార్టీ అభ్య‌ర్థి ఫైళ్ళ శేఖ‌ర్‌రెడ్డిని గెలిపించాల‌ని ఆయ‌న కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా మంత్రి గుంత‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి, జిల్లా బిఆర్ఎస్ అధ్య‌క్షులు కంచ‌ర్ల రామ‌కృష్ణారెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామ‌హేంద‌ర్‌రెడ్డి, రాజ్య‌స‌భ స‌భ్యులు బ‌డుగుల లింగ‌య్య‌యాద‌వ్, మాజీ మంత్రి పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, ఎలిమినేటి ఉమామాధ‌వ‌రెడ్డి, జ‌డ్పీ చైర్మ‌న్ ఎలిమినేటి సందప్‌రెడ్డి, న‌కిరేక‌ల్ ఎమ్మెల్యే చిరుమ‌ర్తి లింగ‌య్య‌, టెస్కాబ్ వైస్ చైర్మ‌న్, డిసిసిబి చైర్మ‌న్ గొంగిడి మ‌హేంద‌ర్‌రెడ్డి, దూదిమెట్ల బాల‌రాజుగౌడ్, తుంగ బాలు, జ‌డ‌ల అమ‌రేంద‌ర్‌గౌడ్, కొలుపుల అమ‌రేంద‌ర్‌గౌడ్, జ‌న‌గాం పాండు, ఎన‌బోయిన ఆంజ‌నేయులు, చింత‌ల కిష్ట‌య్య‌, మ‌ద‌ర్ డైరీ డైరెక్ట‌ర్‌లు గొల్ల‌ప‌ల్లి రాంరెడ్డి, ప‌ర‌మేశ్వ‌ర్‌రెడ్డి, జ‌క్క రాఘ‌వేంద‌ర్‌రెడ్డి, ర్యాక‌ల శ్రీ‌నివాస్, బీరుమ‌ల్ల‌య్య‌, న‌రాల నిర్మ‌ల‌, సుధాక‌ర్‌రెడ్డి, ఏవి కిర‌ణ్‌, శ్రీ‌నివాస్‌రెడ్డి, ఆలేరు మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ మోత్కుప‌ల్లి జ్యోతిప్ర‌వీణ్, ప‌ల్లె సంతోష్‌గౌడ్, సందిల భాస్క‌ర్‌గౌడ్ పాల్గొన్నారు. అంత‌కుముందు ప‌ట్ట‌ణంలో భారీ ఎత్తున డ‌ప్పు, డోళ్ల విన్యాసాలు, బ‌తుక‌మ్మ, బోనాలు, విచిత్ర వేష‌ధార‌ణ‌ల సంద‌డి మ‌ధ్య ర్యాలీ జ‌రిగింది. స‌భావేదిక‌పై గాయ‌ని మ‌ధుప్రియ తెలంగాణ గీతాలు పాడి ఆక‌ట్టుకున్నారు. సిఎం కేసిఆర్ పాల్గొన‌డంతో భారీ బందోబ‌స్తును ఏర్పాటు చేశారు. జ‌న‌గాం ప్ర‌జాశీర్వాద స‌భ‌లో పాల్గొని భువ‌న‌గిరికి చేరుకున్న కేసిఆర్ అక్క‌డ స‌భ ముగియ‌గానే హెలికాప్టర్‌లో తిరిగి హైద్రాబాద్ బ‌య‌లుదేరి వెళ్లారు.

Related News

Select the Topic
Scroll to Top