EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మంచి దొంగ

మంచి దొంగ

18.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని స్వాగత్ బార్ అండ్ రెస్టారెంట్ లో నిన్న తెల్లవారు జామున జరిగిన దొంగతనం…మద్యానికి బానిసైన ఒక యువకుడు చేసిన దొంగతనం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది…దొంగతనం చేసిన యువకుడు ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిలా రాడ్ తో మెయిన్ డోర్ లాక్ తీసి రెస్టారెంట్ లోకి చేరుకున్న విధానం…

ఆ తర్వాత బార్ కౌంటర్ లోకి చేరుకుని డబ్బులు పద్ధతిగా కౌంటర్ పై ఉంచి కేవలం ఒకే ఒక్క MC విస్కీ ఫుల్ బాటిల్ తీసుకుని వెళ్ళిన పద్ధతిని చూసి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజలను ముక్కున వేలేసుకంటున్నారు…

బార్ లో అన్ని మందు బాటిల్స్ ఉన్న కేవలం ఆ యువకుడికి కావలసిన ఒకే ఒక బాటిల్ కోసం దొంగతనానికి తెగబడ్డాడంటే మద్యానికి బానిసైన ఆ యువకుడి మానసిక పరిస్థితి ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

కొసమెరుపు ఏంటంటే ఆ యువకుడు ఉన్నత చదువు చదివిన పట్టణానికి చెందిన వ్యక్తే అంటూ గద్వాల పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top