మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్
ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా
అమరావతి (ఈతరం భారతం);ఇసుక, ఎర్రచందనం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మరో షాక్ తగిలింది. ఆయన ప్రధాన అనుచరుడు మురళీధర్ వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జడ్పీటీసీ పదవికి ఆయన రాజీనామా చేశారు. కష్టాల్లో ఉన్న క్యాడర్‌ను అధిష్ఠానం ఆదుకోవడం లేదని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.కాగా, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగింది. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదును అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్‌పై కూడా కేసు నమోదు చేశారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో తనపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి వేధించారని టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం జగన్ ప్రోత్సాహంతో అప్పటి సీబీఐ డీజీ పీవీ సునీల్‌కుమార్, కొందరు అధికారులు వేధించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అక్రమ కేసులు బనాయించి తనను కస్టడీలోకి తీసుకోవడమే కాకుండా.. హత్యాయత్నం చేశారని తెలిపారు. రఘురామకృష్ణ రాజు ఫిర్యాదు మేరకు ఏ1గా సునీల్‌కుమార్, ఏ2గా ఇంటెలిజెన్స్ మాజీ డీజీ పీఎస్ఆర్ ఆంజనేయులు, ఏ3గా వైఎస్ జగన్, ఏ 4గా అప్పటి సీబీఐ ఏఎస్పీ విజయ్‌పాల్, ఐ5గా జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిపై నగరపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. హత్యాయత్నం, తప్పుడు నివేదికలు తదితర అంశాలకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీటిలో నాన్‌బెయిలబుల్ సెక్షన్లుకూడా ఉన్నట్లు సమాచారం.














