EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

మొదటి జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్ హైకమాండ్

తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మొదటి జాబితాను కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం విడుదల చేసింది. మొత్తం 55 మంది అభ్యర్థుల లిస్టును పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరుతో రిలీజ్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి పోటీ చేస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య పద్మావతి కి తొలిజాబితాలో స్థానం దక్కింది. ఉత్తమ్ హుజూర్ నగర్ నుంచి, పద్మావతి కోదాడ నుంచి బరిలో దిగనున్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ నుంచి, నాగార్జున సాగర్‌లో జానారెడ్డి స్థానంలో ఆయన కుమారుడు జైవీర్‌ కు అవకాశం ఇచ్చారు.

 

కాగా కొత్తగా పార్టీలోకి వచ్చి సీట్లు దక్కించుకున్న 11 మంది నేతలు వీరే..

మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు

మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంత రావు

నిర్మల్ – కూచడి శ్రీహరి రావు

నకిరేకల్ – వేముల వీరేశం

ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి

బాల్కొండ – సునీల్ రెడ్డి

జహీరాబాద్ – ఎ. చంద్ర శేఖర్

కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణ రెడ్డి

గద్వాల – సరిత

కొల్లాపూర్ – జూపల్లి కృష్ణ రావు

నాగర్ కర్నూల్ – కుచుకుళ్ల రాజేష్ రెడ్డి

జాబితాలో చోటు దక్కించుకున్న మహిళా నేతలు..

1. ములుగు – సీతక్క

2. సనత్ నగర్ – కోట నీలిమ

3. గోషామహల్ – మొగిలి సునీత

4. గద్వాల్ – సరిత తిరుపతయ్య

5. కోదాడ – పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి

6. స్టేషన్ ఘన్ పూర్ – సింగాపురం ఇందిర

 

 

Related News

Select the Topic
Scroll to Top