యాదాద్రి జిల్లాలో వైభవంగా ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు
భువనగిరి, అక్టోబర్ 14 (ఈతరం ఇండియా న్యూస్) : యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. పట్టణాలు, గ్రామాలలోని పలు దేవాలయాలు, వీధుల కూడల్లలో బతుకమ్మలను పెట్టి ప్రకృతి పూల, గౌరి పూజల అనంతరం ఉయ్యాల పాటలు పాడుతూ ఆటలు ఆడారు. సంప్రదాయరీతిలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు జరిగిన అనంతరం నీటిలో నిమజ్జనం జరిపి వాయనాలను ఇచ్చి పుచ్చుకున్నారు. బతుకమ్మ వేడుకలు చూసేందుకు గ్రామాలు, పట్టణాలలో మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుక ఘనంగా జరిగి ముగిసింది.
















