రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద పదవి భాద్యతలు
హైదరాబాద్ జూలై 17 (ఈతరం భారతం);తెలంగాణా రాష్ట్ర మహిళా కమీషన్ చైర్ పర్సన్ గా నేరెళ్ల శారద బుదవారం పదవి భాద్యతలు చేపట్టారు బుద్ద భవనం లో మహిళా కమీషన్ కార్యాలయం లో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క సమక్షం లో శారద పదవి భాద్యతలు స్వీకరించారు. అనంతరం మంతరులు సీతక్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంఎల్ఏ దానం నాగేందర్ లు శారదను అభినందించారు.ఈ సందర్బంగా నేరెళ్ల శారద మాట్లాడుతూ రాష్ట్రము లో మహిళల సమస్యల పరిష్కారం,వారి హక్కుల ను కాపాడడం కోసం కృషి చేస్తనన్నారు.














