EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

రేవంత్ రెడ్డి భాష మార్చుకుంటే మంచిది

పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తన భాషను మార్చుకుంటే మంచిదని నోటి దూల, అగ్రకుల అహంభాహం, ఆధిపత్య మదంతో బీసీ ఎస్సీ ఎస్టీలపై అనుచితంగా కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.అగ్రకులాలు ముఖ్యంగా రేవంత్ సామాజిక వర్గానికి చెందిన వారు పార్టీ మారుతి చడి చప్పుడు చేయని ఆయన బీసీల విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా ఎట్ల పడితే అట్లా ఏది పడితే అది మాట్లాడి బీసీల మనోభావాలు దెబ్బతిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న పొన్నాలపై మాట్లాడిన విధానాన్ని బీసీలంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నామని రాజ శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. గతంలో బీసీ కులాలను వృత్తుల పేరుతో కించపరిచారని నిన్న కాకమున్న మందకృష్ణ మాదికపై చాలా చిల్లరగా మాట్లాడారని నేడు పొన్నాల లక్ష్మయ్య ను కాంగ్రెస్ పార్టీ నుంచి పొమ్మనకుండా పోగపెట్టి ఆయనను తీవ్రంగా అవమానించి రాజీనామా చేసేలా చేసి తీరా సిగ్గు లేకుండా చచ్చే ముందట అంటూ కించపరచడం చాలా దారుణం అన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ నుండి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అనిల్ కుమార్ రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, రాజగోపాల్ రెడ్డి పోతే ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ బీసీల గురించి మాట్లాడుతుంటే గల్లీలో రేవంత్ రెడ్డి బీసీలను అవమానిస్తున్నారని రేవంత్ రెడ్డి వైకరి కాంగ్రెస్ పార్టీకి నష్టమని ఆయన అన్నారు.

Related News

Select the Topic
Scroll to Top