EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలి : జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

22.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

లక్ష్య సాధనకు ఏకాగ్రత, పట్టుదలతో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం కలెక్టర్ తెలంగాణ వెనుకబడిన తరగతుల ఉద్యోగ నైపుణ్య అభివృద్ధి, శిక్షణ కేంద్రంలో గ్రూప్-1 ఉద్యోగార్థులకు చేపట్టిన ఉచిత శిక్షణా తరగతులు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గురించి కలెక్టర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎప్పుడు శ్రమపై దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా ఫలితం వస్తుందని తెలిపారు. సిలబస్ ను అనుసరించాలని ఆయన అన్నారు. ఒకరినొకరు సహకరించుకోవాలని, తమకు తెలిసిన విషయాలు ఒకరినొకరు పంచుకోవాలని ఆయన అన్నారు. ఇంటిని, చదువును బ్యాలన్స్ చేరుకోవాలన్నారు. నిరాశ, నిస్పృహలకు లోనికావద్దని, ఆశావాహ దృక్పథంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పరిస్థితులు లక్ష్య సాధనకు అడ్డంకులు కావని, అవకాశాలను విజయాలుగా మలచుకోవాలని అన్నారు. చదువుతో పాటు అరగంట ఆటలు, వ్యాయామానికి ఖచ్చితంగా కేటాయించాలన్నారు. మానసికంగా దృడంగా ఉండాలని, సమస్యలకు ఆందోళన చెందకుండా, పరిష్కారానికి యోచన చేయాలన్నారు. లక్ష్య సాధనకు వనరులు ఎప్పుడు అడ్డంకి కాదని ఆయన తెలిపారు. వనరులు సృష్టించుకోవాలని, అవకాశాలు విజయానికి మెట్టుగా మలచుకోవాలని కలెక్టర్ అన్నారు. కలెక్టర్ ఉద్యోగార్థుల సందేహాలు నివృత్తి చేశారు.ఈ సందర్భంగా శిక్షణ సహాయ కలెక్టర్ మిర్నల్ శ్రేష్ఠ, స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత తదితరులు ఉన్నారు.

Related News

Select the Topic
Scroll to Top