EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం 60 మంది చిన్నారులకు గుండె వైద్య పరీక్షలు సేవా దృక్పథమే లయన్స్ లక్ష్యం లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు 

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

60 మంది చిన్నారులకు గుండె వైద్య పరీక్షలు

సేవా దృక్పథమే లయన్స్ లక్ష్యం

లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు

13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల ఖమ్మం.

ప్రజలకు సేవ చేసే లక్ష్యంగా తాము ముందుకు పోతున్నామని లయన్స్ క్లబ్ ఖమ్మం అధ్యక్షులు డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు అన్నారు. శనివారం లయన్స్ క్లబ్, కూరపాటి చిన్నపిల్లల హాస్పిటల్, అభయ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నపిల్లల గుండె జబ్బులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అభయ హాస్పిటల్ లో నిర్వహించిన ఈ శిబిరంలో దాదాపు 60 మంది గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. గుండె వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్, చిన్నపిల్లల వైద్యనిపుణులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ తదితర వైద్యులు ఉచిత వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ బొలికొండ శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఖమ్మం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని, పేద వర్గాలకు చెందిన వారిని ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అందులో భాగంగానే గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారులకు వైద్య సేవలు అందించేందుకు తాము ఈ శిబిరం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కార్యదర్శి గెల్లా శ్రీరామ్, కోశాధికారి గోవిందరావు, పి ఎం ఐ ఎఫ్ లయన్ డాక్టర్ రాఘవరెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు కూరపాటి వెంకటేశ్వరరావు, జనార్ధన రావు తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top