వంద రోజుల్లో స్వర్ణకారుల కార్పొరేషన్ కి అడుగులు
ముందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్
విజయవాడ జూలై 20 (ఈతరం భారతం);ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అత్యవసర సమావేశం విజయవాడ రాష్ట్ర స్వర్ణకార సంఘం కార్యాలయం స్టీరింగ్ కమిటీ సభ్యులు ధనాలకోట శ్రీనివాసరావు వాసు పంచుమర్తి శ్రీనివాసరావు తొ రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయవాడ శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేసన శివ భావనారాయణ ఎం పోతులూరి ఆచారి నవ్యాంధ్ర కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జింక దివ్య నారాయణ కడారు వెంకటేశ్వర్ రావు విజయవాడ గవర్నర్ పేట కామాక్షి స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి కడారు హేమ సుందర్ రాష్ట్ర అధికార ప్రతినిధి పెంట కిరణ్ పాల్గొన్నారు. రాష్ట్రాంలో ప్రస్తుత స్వర్ణకారుల పరిస్థితి నూతనంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలిపిన సమావేశం ఆగస్టు 10వ తారీఖు విజయవాడలో స్వర్ణకార గోల్డ్ అప్రైజర్లను బ్యాంకుల్లో పర్మినెంట్ ఉద్యోగులుగా కేంద్ర ప్రభుత్వం చట్టసభల్లో పెట్టి తీర్మానం చేయాలని డిమాండ్ తో సమావేశం మరియు ఇతర అంశాలు 19 జులై తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం పెద్దలతో జరిగిన సమావేశం వివరాలు ఈ సందర్భంగా స్టీరింగ్ కమిటీ సభ్యులు పలు సూచనలు రాష్ట్ర కమిటీకి సూచించారు














