వర్షాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
మంత్రి పొంగులేటి క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి
14.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఖమ్మం రూరల్ వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం క్యాంప్ కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని మద్దులపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ జిల్లా నాయకులు అంబటి సుబ్బారావు, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అంబటి ఈశ్వర్ ఆధ్వర్యంలో అక్కడి వృద్ధులకు ఆదివారం దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా దయాకర్ రెడ్డి హాజరయ్యారు. టైర్లు, ప్లాస్టిక్ డబ్బాలతో పాటు నీరు నిల్వ ఉండే ప్రాంతాలలో దోమలు వ్యాప్తి చెంది, అనారోగ్యానికి గురిచేస్తాయన్నారు. కావున వాటిని తొలగించడంతో పాటు ఇంటి పరిశర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పంచాయతీ, వైద్యశాఖలు నిత్యం గ్రామాల్లో పర్యటించి, ప్రజలను చైతన్య పరచడంతో పాటు వారి సేవలను అందించాలని సూచించారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన తండ్రి,కుమారులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కర్లపూడి వెంకటేశ్వర్లు, సప్పిడి ప్రభాకర్, పోతుల ప్రసాద్, సలవది రాజేష్, గొడ్డుగొర్ల గురవయ్య, షేక్ నాగులమీరా, అంబటి ఉపేందర్, షేక్ చాంద్ పాషా, షేక్ మస్తాన్, షేక్ ఠాగూర్, గుంలేటి నాగరాజు, గుడిబండ్ల సతీష్, గొడ్డుగొర్ల రమణయ్య, ఐతగాని ప్రవీణ్, అబ్బూరి సుదీర్, సిరిపురపు గోపి, కందుల పవన్, కామ భాస్కర్, కొప్పుల నవీన్, బౌందల సాయి, సురేష్, జ్ఞానేష్, జీవన్, చంటి, గోపి, తూమాటి త్రినాథ్, బోల్లెద్దు రాము, కోట రాంప్రసాద్, కందుల సాయి, గుత్తికొండ రవి, పవన్, ఠాగూర్, లక్ష్మన్ తదితరులు పాల్గొన్నారు.














