ప్రజలు వారి వృత్తులను మాతృ ప్రేమతో చేసినప్పుడే ప్రజలందరూ ఐకమత్యంతో సుఖసంతోషాలతో జీవిస్తారని మాతృదేవో భవ సత్సంగ్ ఆర్గనైజర్ విజయదుర్గ తెలిపారు ప్రతి శుక్రవారం మాతృదేవో భవ సత్సంగ్ ఆధ్వర్యంలో రామరాజ్యం ఆఫీసు గోకుల్ ప్లాట్స్ సర్కిల్ కేపీహెచ్బీ కాలనీ హైదరాబాద్ నందు నిర్వహించారు.ఈ సందర్భంగా మాతృదేవో భవ సత్సంగ్ ఆర్గనైజర్ విజయదుర్గ మాట్లాడుతూ సత్సంగాలను నిర్వహిస్తూ ప్రజల్లో మాతృ ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని తెలిసే విధంగా స్వస్థంగాల ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.రామరాజ్యం అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ తమ ఆఫీసులో సత్సంగానీ నిర్వహించినందుకు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో మాతృదేవోభవ సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేబి శ్రీధర్ సభ్యులు సత్యనారాయణ సత్యం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు