EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం

శాకాంబరి ఉత్సవాలు ప్రారంభం

19.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల

ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల  శాకంబరీ ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. అమ్మవారి ఆలయంతో పాటు ఉపాలయాలను కూరగాయలతో అందంగా అలంకరించారు. కూరగాయల రాశికి  ఈవో రామారావు, అర్చకులు పూజలు చేశారు. ఉత్సవాలను విజయవంతం చేయాలని అమ్మవారిని వేడుకున్నారు. శని, ఆదివారాల్లో  హోమాలు, ప్రత్యేక అర్చనలు జరుగుతాయి. కూరగాయలతో వండిన కదంబ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేస్తారు. ఉత్సవాల నిమిత్తం పెద ఓగిరాల నుంచి మూడు మెట్రిక్‌ టన్నులు, గుంటూరు జిల్లా నారా కోడూరు, చేబ్రోలు, తెనాలి నుంచి ఒకటిన్నర మెట్రిక్‌ టన్నుల కూరగాయలు వితరణగా వచ్చాయి. యడ్లపల్లి, సంగం జాగర్లమూడి నుంచి మూడు మెట్రిక్‌ టన్నుల నిమ్మకాయలు, గుంటూరు, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌ నుంచి ఆరు మెట్రిక్‌ టన్నులు, సిద్ధాంతం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు నుంచి ఆరు టన్నులు, విజయవాడ నుంచి 500 కిలోల చొప్పున కూరగాయలు దాతల నుంచి అందాయి.

Related News

Select the Topic
Scroll to Top