EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుక

శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుక

13.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

స్థానిక గుట్టల బజార్ ఖమ్మం లోని శ్రీ రామకృష్ణ విద్యాలయంలో ఈరోజు కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం వేడుకగా జరిగింది . అభయా ఫౌండేషన్ హైదరాబాద్ వారు రీగల్ రెక్నా పర్డ్ అనే కార్పొరేట్ సంస్థ సౌజన్యం తో ఖమ్మం లోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స వారి ప్రోత్సాహం తో శ్రీ రామకృష్ణ విద్యాలయం పాఠశాల కు కంపుటర్ ల్యాబ్ ను స్పాన్సర్ చేశారు.

ముఖ్య అతిథి  శ్రీ బాలచంద్ర  విద్యార్థులను ఆచార్యులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆట పాట గేయం అభినయం తో విద్య నేర్పించే విధానాన్ని వివరిస్తూ మాట్లాడారు, విద్యార్థులు సమాజంలో ఎదురవుతున్న సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశం గురించి అభయా భవిత లోని 10 అంశాల తో వివరించారు.

పాఠశాల అధ్యక్షులు గోంగూర వెంకటేశ్వర్లు  మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచం లో పిల్లలకు విలువల తో కూడిన విద్య తో పాటు  సాంకేతిక పరిజ్ఞానం పై అవగాహన, అందులోనూ కంప్యూటర్ విద్య ఎంతో అవసరం అని అందుకు పిల్లలకు తక్కువ ఖర్చు తో కంప్యూటర్ విద్య ను  అందించేందుకు సహకరించిన అభయ ఫౌండేషన్, రీగల్ రెక్నా ోర్డ్, విహె సంస్థలకు ధన్యవాదాలు తెలియజేశారు.

బాలచందర్ గారు బెరుకు తొణుకు లేని మాట, పెద్దలతో పెద్దవాడిగా, పిల్లలతో పిల్లవాడిగా మారిన తీరు, సంకోచం లేని ముందు చూపు వారి నుంచి నేర్చుకోవాలి అని, ఈ కంప్యూటర్ ల్యాబ్ కంటే ముందరే వారి అమూల్యమైన రచన కంపాస్ అనే పుస్తకం పాఠశాల లైబ్రరి కి పంపారు. అందులో పిల్లల లో ఉండే ఎన్నో సమస్యలు వాటికి పరిష్కారాలను వివరించిన తీరు ఎంతో స్పూర్తి దాయకం అని పాఠశాల ప్రధానాచార్యా సంతోష గౌతం అన్నారు.

ఈ కార్యక్రమం లో ఖమ్మం విభాగ్ అధ్యక్షులు గోంగూర వెంకటేశ్వరరావు , పాఠశాల కార్యదర్శి శ్రీనివాసరావు  విభాగ్ కార్యదర్శి వేమవరపు సుబ్బారావు , ప్రబంధ కారుని సభ్యులైన అశోక్ , అచ్యుత్ గారు యుగేందర్  చరణ్  మోతుకూరి నారాయణ , తెలంగాణ నారాయణ పాఠశాల అధినేత చెంద్రశేఖ ర్  పోషకులు ,పూర్వ విద్యార్థులు, ప్రబంధకారిణి సభ్యులు పాఠశాల ఆచార్య బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top