మాతృ ప్రేమతో సేవ చేయాలని అప్పుడే సేవకు పరమార్ధం కలుగుతుందని సహాయ ఫౌండేషన్ చైర్మన్ అనిత హరి తెలిపారు. శుక్రవారం ఎర్రమంజిల్ కాలనీ లోని సహాయ ఫౌండేషన్ కార్యాలయంలో మాతృదేవోభవ సత్సంగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలు వారి వృత్తులను మాతృ ప్రేమతో చేసే విధంగా సత్సంగాల ద్వారా చైతన్య పరుస్తున్న మాతృదేవోభవ సత్సంగ్ నిర్వాహకులను ఆమె అభినందించారు ఈ సందర్భంగా మాతృదేవోభవ సత్సంగ్ ప్రతి శుక్రవారం వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం అభినందనీయమన్నారు సత్సంగంలో మెడికల్ క్యాంప్ నిర్వహించిన ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మీ అన్నదాత మాట్లాడుతూ సమాజానికి మాతృ ప్రేమతో సేవ చేయడం ఇప్పటి పరిస్థితుల్లో చాలా అవసరం అన్నారు మాతృదేవోభవ సత్సంగ్ కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు కార్యక్రమంలో మాతృదేవో సత్సంగ్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేబీ శ్రీధర్ కోఆర్డినేటర్ నందికొండలరావు సంఘ సేవకురాలు షాహిన్ టీచర్ అశోక్ హరి జి తదితరులు పాల్గొన్నారు