EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సాహితీవేత్త వడ్డేపల్లి కృష్ణకు జీవన సాఫల్య పురస్కారం

శ్రీమానస ఆర్ట్ థియేటర్స్, చిరునవ్వు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 23 తేదీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ త్యాగరాయ గానసభలోని కళా లలిత కళా వేదికలో ప్రముఖ కవి, ఆధ్యాత్మిక వేత్త ఉమ్మడి సింగు కృష్ణ రావు స్మారక జీవన సాఫల్య పురస్కారం ప్రముఖ గేయ కవి డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ కు ప్రదానం చేయనున్నట్టు సంస్థ అధ్యక్షుడు, రచయిత బండారు ప ల్లి రామచందర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇదే సభలో ప్రముఖ కవి, కీర్తి పురస్కార గ్రహీత డాక్టర్ ఉమ్మడి సింగు రాఘవరావు రచించిన చిరునవ్వు కవితా సంపుటిని సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న సాహితీవేత్త ఆచార్య కసిరెడ్డి ఆవిష్కరిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ సభకు సినీ దర్శకుడు, నిర్మాత డాక్టర్ నిష్టల గోపాలకృష్ణ అధ్యక్షత వహిస్తారని రామచందర్ రావు పేర్కొన్నారు. కవి ఉమ్మడి సింగు కృష్ణారావు 94వ జయంతి సందర్భంగా సభకు ముందు కవయిత్రి డాక్టర్ రాధా కుసుమ నిర్వహణలో కవి సమ్మేళనం జరుగుతున్నట్లు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top