EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో బతుకమ్మ వేడుకలు

తెలంగాణ వారసత్వ సంపద బతుకమ్మ అని, పండుగ విశిష్టతను తెలియజేస్తూ బతుకుతో ఇంత ప్రత్యక్ష సంబంధమున్న పండుగ మరొకటి లేదని, బతుకమ్మ ప్రకృతి తల్లితో ముడిపడి ఉన్న ప్రత్యేకమైన పండుగని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లిల్లీ మేరి అన్నారు. నేడు ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన బతుకమ్మ వేడుకలు సందర్భంగా లిల్లీ మేరి మాట్లాడుతూ బతుకమ్మ తయారీ లకు ఉపయోగించే రంగురంగుల అడవి పువ్వులు, నీటి వనరులను శుభ్రపరిచే ఔషధ గుణాలు కలిగి ఉంటాయని, ఈ పండుగకు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని , పుట్టింటికి చేరిన ఆడపిల్లలు తీరొక పేరుతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ ఆనంద ఉత్సవాల నడుమ జరుపుకునే బతుకమ్మ ఉత్సవాలు పల్లెలలో ప్రత్యేకతను చాటుతున్నాయని లిల్లీ మేరి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలు పువ్వులనే దేవతలుగా మలచి పూజిస్తారని, పువ్వులనే పూజించే విశిష్ట సంప్రదాయం ఈ పండుగ యొక్క ప్రత్యేకత అని, తంగేడు, గునుగు, కట్ల, గుమ్మడి పువ్వులతో బతుకమ్మను తయారు చేస్తారని, ప్రకృతిని ఆరాధించే ప్రత్యేకమైన పండుగ బతుకమ్మగా లిల్లీ మేరి అభివర్ణించారు. బతుకమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై మరియు నర్సింగ్ కళాశాల విద్యార్థినులు పై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు లిల్లీ మేరి చెప్పారు. ఈ కార్యక్రమమునకు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఆచార్యులు డాక్టర్ షిబా, సహాయ ఆచార్యులు ఉమామహేశ్వరి, లెక్చరర్స్ రాజమణి, చైతన్య, శైలజ, అరుణ, భవాని, సుప్రియ, ఏవో సురేందర్, ఆఫీస్ సూపరింటెండెంట్ రామచందర్ , కృష్ణ లీల, అధ్యాపకురాలు భావన కళాశాల సిబ్బంది మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top