టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఛైర్పర్సన్ కాకుమాను జ్యోతి ఆద్వర్యం లో ఒకలాండ్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా సుమారు 150 మంది పిల్లలకు పోషకాహారం క్రింద బిస్కెట్లు, వేరుశెనగ చిక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా కాకుమాను జ్యోతి మాట్లాడుతూ ప్రతి పిల్లవాడికి ప్రతి రోజు విధిగా పోషకాహారం అందించినట్లయితే వారి ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రక్మం లో పాల్గొన్న వారందరికీ కాకుమాను జ్యోతి, రమణయ్య, సర్వనాద్ రెడ్డి, నర్సింహాచారి, అన్నపూర్ణ ధన్యవాదాలు తెలిపారు.