EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

స్పోర్ట్స్ అథారిటీ కార్యకలాపాలు ద్విగుణికృతం

స్పోర్ట్స్ అథారిటీ కార్యకలాపాలు ద్విగుణికృతం

క్రీడారంగంలో సమూల మార్పుకు సమిష్టి కృషి

ఎల్బీ స్టేడియంలో సమీక్ష నిర్వహించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి

హైదరాబాద్ జూలై 19 (ఈతరం భారతం);తెలంగాణ రాష్ట్రంలో క్రీడా అభివృద్ధి క్రీడాకారుల సంక్షేమం కొరకు క్రీడారంగంలో మౌలిక మార్పుల కొరకు సమిష్టిగా కృషి చేద్దామని తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ కే.శివసేనారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం స్పోర్ట్స్ అథారిటీ ప్రధాన కార్యదర్శి ఎల్బీ స్టేడియంలో ఆయన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలపై వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి మరియు ఇతర అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు గత పది ఏళ్ల నుండి కుంటుపడిన అన్ని రంగాల మాదిరిగానే క్రీడారంగంలో కూడా సమూలమార్పు రావాలని, తెలంగాణ ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి,క్రీడాకారుల సంక్షేమానికి మంచి జరగాలని ఆయన అధికారులను ఆదేశించారు.స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ కార్యకలపాలు ద్విగుణికృతము కావాల్సిన అవసరం ఉందని ఇందుకు స్పోర్ట్స్ అథారిటీ సిబ్బంది,కోచులతోపాటు క్రీడా సంఘాలు, యావత్ తెలంగాణ క్రీడా సమాజం లోని ప్రతి ఒక్కరి సహకారం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎల్బీ స్టేడియంలో కోచింగ్ ఇస్తున్న వివిధ క్రీడాంశాల గురించి ఆయన తిరిగి వివరాలు తెలుసుకున్నారు. మరింత మెరుగైన శిక్షణ ఇచ్చి భావి క్రీడాకారులను చాంపియన్లుగా తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి ఆదేశాల మేరకు, ఎల్బీ స్టేడియంలో ప్రస్తుతం ఉన్న స్కేటింగ్ రింక్ ను మార్చి బాస్కెట్ బాల్ స్టేడియం నిర్మించాలన్న ప్రతిపాదనపై ఆయన సమీక్షిస్తూ, స్కేటింగ్ రింక్ ను అక్కడ్నుంచి మార్చకుండా, బాస్కెట్ బాల్ స్టేడియానికి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసారు.ఆ స్థలంలో నిర్మించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు . ఇందుకోసం అవసరమైన పనులు చేపట్టడానికి దాదాపు ఒక కోటి 20 లక్షలు మంజూరు చేశారు. అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో స్కేటింగ్ రింక్ ను తీర్చిదిద్దాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షా సమావేశంలో ఆయన వెంట వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి తోపాటు డిప్యూటీ డైరెక్టర్లు అనురాధ,రవీందర్ శ్రీలత,చంద్రారెడ్డి, సుజాత తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top