EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరగలేదు   అవకతవకలుజరిగాయంటే నిరూపిస్తే దేనికైనా సిద్దం   మెంబర్ షిప్ లేదనేవారు పునరుద్దరించుకోవచ్చు   సమస్యలుంటే కలిసి చర్చించుకుందాం భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్

హౌసింగ్ సొసైటీలో అవకతవకలు జరగలేదు

  అవకతవకలుజరిగాయంటే నిరూపిస్తే దేనికైనా సిద్దం

మెంబర్ షిప్ లేదనేవారు పునరుద్దరించుకోవచ్చు

  సమస్యలుంటే కలిసి చర్చించుకుందాం

భాగ్యనగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్

హైదరాబాద్ జూలై 15 (ఈతరం భారతం); : భాగ్యనగర్ ఎన్జీవో(గచ్చిబౌలి) మ్యూచువల్ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఎలాంటి అవకతవకలు జరగలేదని, కొంతమంది పని గట్టుకొని చేస్తున్న దుష్ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు. ఈ అంశంలో తాను ఏ విచారణకైనా సిద్ధమని అన్నారు. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సొసైటీ డైరెక్టర్లతో కలిసి ఆయన మాట్లాడారు. సొసైటీలో సబ్యత్వం తీసివేసారని, లేదని అనేవారు సొసైటి కార్యాలయానికి వచ్చి పునరుద్దరించుకోవచ్చునన్నారు. తన తండ్రి ద్వార వచ్చిన 2 ఏకరాలు తప్ప నాకు ఇతర ల్యాండ్ లేదని ఒకవేల ఉన్నట్లు నిరూపిస్తే విలేకరులందరికి రాసిస్తానన్నారు. పాండురంగా రావు అనే వ్యక్తీ తమ సొసైటీలో లేరని, అతనిపై అవినీతి ఆరోపణలు ఉంటె అతని సబ్యత్వం తీసివేసినట్లు తెలిపారు. ఐనప్పటి ఆటను సీనియర్ ఉద్యోగని అతనిపై గౌరవం ఉందన్నారు.ఏదైనా సమస్య ఉంటె ముఖాముఖీ చర్చిన్చుకున్దామని అన్నారు. నోటివరకు వచ్చిన ముద్దని చెడగొట్టవద్దని ప్రాదేయ పడ్డారు. ఫిబ్రవరిలో సొసైటి ఎన్న్కలు ఉన్నాయని అందులో పోటి చేసి గెలుపొందాలన్నారు. తానూ వైదోలగాతానికి సిద్దమన్నారు.2008 లో శేరిలింగంపల్లి మండలం, గోపన్నపల్లిలోని సర్వే నెంబర్ 36, 37 లలో 189 ఎకరాల 11 గుంటల స్థలాన్ని ప్రభుత్వ ఉద్యోగుల ఇండ్ల స్థలాల కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూమిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని 4 వేల మంది రిటైర్డ్, సర్వీస్ ఉద్యోగుల పొట్టకొట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికల్లో ఉద్యోగులం సరైన గుణపాఠం చెప్పామన్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొసైటీలో శంకుస్థాపన చేశారని, ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డి ఆ భూములకు తమకు తిరిగి కేటాయించి ఉద్యోగులను ఆదుకోవాలని వేడుకున్నారు.ఈ సమావేశం లో సొసైటీ కార్యదర్శి మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు రాజేష్,కోశాధి కారి శ్రీనివాస్, డైరక్టర్స్ ప్రబాకర్ రెడ్డి, శ్రీనివాస్,సంధ్య,అమర జ్యోతి,నాయక్,రజిత తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top