34 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పని చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేనందుకు సంతోష పడుతున్నా : బక్క జడ్సన్
హైదరాబాద్ జూలై 20 (ఈతరం భారతం);: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జడ్సన్ మాట్లాడుతూ… 34 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి పని చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీలో లేనందుకు సంతోష పడుతున్నానని తెలిపారు.నేను కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని కాదు.. కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీలో సభ్యుడిని. గాంధీ ఆశ్రమంలో చర్ఖా చుట్టడం నేర్చుకున్నవాడిని. నాది చర్ఖా బ్యాచ్. కాంగ్రెస్ అధిష్టానంతో ఇంటర్నల్‌గా వర్క్ చేసిన వ్యక్తిని. దేశాభివృద్ధి గురించి మాట్లాడే కాంగ్రెస్ నేతలు.. రెడ్ హ్యాండ్‌గా దొరికిన ముద్దాయిని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేశారు. వీళ్లకేం ఖర్మ పట్టిందని బాధపడ్డాను. సరై టైం బాగాలేక సీఎంను చేశారనుకుందాం.. ముఖ్యమంత్రి వ్యవహారశైలి కుక్క తోక వంక మాదిరిగా ఉంది. కాంగ్రెస్ పార్టీని చూస్తుంటే జాలి వేస్తోంది. ఆ పార్టీలో ఇవాళ నేను సభ్యుడిగా లేనందుకు గర్వపడుతున్నాను. ఒక వేళ సభ్యుడిగా ఉంటే.. ఇవాళ నేను ఒక విలన్‌ను అయిపోయేవాడిని. ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తలను చంపేశారు. జీవితకాలంలో కాంగ్రెస్ పార్టీలోకి పోవద్దనే ఆలోచనకు వచ్చాను అని బక్క జడ్సన్ స్పష్టం చేశారు.














