EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్లు:    మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

ఈతరం భారతం /భద్రాద్రి కొత్తగూడెం /రిపోర్టర్ / యం డి. షఫీ యు జమ /ఏప్రిల్ 22 :

ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటిడిఏ పీవో రాహుల్ తదితరులు పాల్గొన్నారు.పర్యటనలో భాగంగా మంత్రి ఇల్లందు 10వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తడికమల్ల భాగ్యమ్మ, కోడిమల్ల లక్ష్మి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, పూజలు నిర్వహించి లబ్ధిదారులతో కలిసి గృహాలను ప్రారంభించారు. అనంతరం ఇల్లందు మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన చైర్‌పర్సన్ గది ప్రారంభించి, చైర్‌పర్సన్ కిరణ్ మిత్రకు శుభాకాంక్షలు తెలిపారు. ఆపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇల్లందు పట్టణ అభివృద్ధికి ప్రత్యేక మున్సిపల్ సమావేశం ఏర్పాటు చేసి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతామని అన్నారు . ఇల్లందు అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం, త్వరలో రెండు విడతల్లో నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజల శ్రేయస్సే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రాజకీయాలకు అతీతంగా అందరికీ సమానంగా అభివృద్ధి ఫలాలు అందేలా కృషి చేయాలని సూచించారు. వేసవి కాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్, కౌన్సిలర్లు ప్రతిరోజూ సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో నిత్యం సంబంధం పెంచుకుంటూ ఉదయం, సాయంత్రం సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు.

ప్రజా ప్రభుత్వం నిరంతరం ప్రజల కోసం పని చేస్తుందని, ప్రతి ప్రజాప్రతినిధి బాధ్యతగా ప్రజలకు సేవ చేయాలని మంత్రి కోరారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు అనుభవం లేదని భావించకుండా అధికారులతో సమన్వయం చేసుకొని సమస్యలను పరిష్కరించాలని సూచించారు.ఇల్లందు శాసనసభ్యులు కోరం కనకయ్య మాట్లాడుతూ మంత్రి నాయకత్వంలో నియోజకవర్గం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో 200 నుంచి 700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారున్నారు. కొత్తగా వార్డు కౌన్సిలర్లు ప్రతి వార్డులో సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 24 వార్డుల్లో పారిశుద్ధ్యం, లైటింగ్, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. వేసవిలో నీటి సమస్యలు లేకుండా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని, వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నామని వివరించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, కొత్తగూడెం ఆర్డీవో మధు, గృహ నిర్మాణ శాఖ ఫీడింగ్ రవీందర్ నాథ్, తాసిల్దార్ ఎంపీడీవో ధన్సింగ్,మున్సిపల్ వైస్ చైర్మన్ రాజు, మున్సిపల్ కమిషనర్ సంబంధిత శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top