ఈతరం భారతం భద్రాద్రి కొత్త గూడెం/ రిపోర్టర్/ యం డి. షఫీ యు జమ ఏప్రిల్ 21 :
తెలంగాణ ఉత్తర మండల విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. జిల్లాలో సాగుతున్న వివిధ విద్యుత్ అభివృద్ధి పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు దిశానిర్దేశం చేశారు.
పర్యటనలో భాగంగా తొలుత ఇల్లందు మండలం, ఒడ్డుగూడెం గ్రామంలోని నూతన పౌల్ట్రీ ఫామ్‌ను సీఎండీ సందర్శించారు. అక్కడ నూతన విద్యుత్ కనెక్షన్ పొందిన లబ్ధిదారుడు వీరభద్రరావు తో మాట్లాడారు. విద్యుత్ కనెక్షన్ పొందే ప్రక్రియలో సిబ్బంది పనితీరు, పనులు జరిగిన విధానంపై ఆరా తీశారు. వినియోగదారుడు సంతృప్తి వ్యక్తం చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సబ్ స్టేషన్ పరిశీలన: టేకులపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ పనులను ఆయన పర్యవేక్షించారు. వేసవిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నాణ్యమైన పనులు సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లా స్టోర్స్ సందర్శన: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపట్నంలో మొట్టమొదటిసారిగా నిర్మితమవుతున్న జిల్లా స్టోర్స్ ప్రాంగణాన్ని సీఎండీ సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి, అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. విద్యుత్ పరిస్థితిపై ఉన్నతాధికారులతో చర్చించారు.
ఈ కార్యక్రమంలో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సూపర్ ఇంటెండింగ్ ఇంజనీర్ మహేందర్, కొత్తగూడెం డివిజనల్ ఇంజనీర్ యం ఆర్ టి . డి ఈ, ఎ ఎ ఓ, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.














