EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రూ. 2.30 లక్షల ఆభరణాలు ఎత్తుకుపోయిన దొంగలు

ఈతరం భారతం భద్రాద్రి కొత్తగూడెం జులై 28 :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం బాలరాజుగూడెంలో దొంగతనం సంఘటనా కలకలం రేపింది. గ్రామానికి చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో గుర్తుతెలియని దొంగలు, సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు.బీరువా పగలగొట్టి అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దొంగిలించిన ఆభరణాల విలువ సుమారుగా రూ.2.30 లక్షలు అని పోలీసులు తెలిపారు. ఈ మేరకు దమ్మపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులను ప్రజలను కోరుతున్నారు.

Related News

Select the Topic
Scroll to Top