ఈతరం భారతం హైద్రాబాద్ ఫిబ్రవరి 20
ప్రముఖ జాతీయ కవి, రచయిత, అనువాదకుడు, భరత మాత గర్వించే తెలంగాణ ముద్దుబిడ్డ డా. పెరుక రాజు గారికి సాహిత్యంలో చేస్తున్న విశిష్ట కృషికి గాను ప్రతిష్ఠాత్మకమైన విశిష్ట సాహితీ ప్రతిభా పురస్కారం 2026 సామాజిక చైతన్యంతో కూడిన శక్తివంతమైన కలంతో వివిధ భాషల్లో ఆయన చేస్తున్న అవిరళ విశిష్ట సాహిత్య సాగు ప్రతిభ కు గుర్తింపుగా రవీంద్ర భారతి, భాగ్యనగరం లో తెలంగాణ భాషా సాంస్కృతికశాఖ, జాతీయ తెలుగు సారస్వత పరిషత్, ఆదిలీల ఫౌండేషన్ న్యూఢిల్లీ & తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మాతృ భాష దినోత్సవ ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రధానం చేశారు. రాజు గేయం ” తెలుసుకో” అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో డా కేశరాజు రాంప్రసాద్, తెలుగు సారస్వత పరిషత్ అధ్యక్షులు, నిర్వాహకులు పి బడే సాబ్. డా ఆదినారాయణ, ఆదిలీల ఫౌండేషన్, న్యూ ఢిల్లీ అధ్యక్షులు, బాల చారి , తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ, కార్య దర్శి, కుమారి పి వృoధ, శ్రీమతి రాధ కుసుమం సాహితీవేత్తలు, భాషా ప్రేమికులు, కవులు, యువకులు మరియు తదితరులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా జరిగిన ఈ కార్యక్రమంలో అందరు తమ అభిప్రాయాలను తెలియ జేశారు.















