ఈతరం భారతం హైదరాబాద్, జులై 15 : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల బేగంపేటలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అధ్యయన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ మారోజు రామాచారి మంగళవారం తెలిపారు. డిగ్రీ కొరకు ఇంటర్మీడియట్, ఓపెన్ ఇంటర్, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన వారు అర్హులని చెప్పారు. అయిన వాళ్లు అర్హులు అదేవిధంగా డిగ్రీ పూర్తి చేసిన వారు ఎం ఏ హిస్టరీ, ఎకనామిక్స్,పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు లిటరేట్, ఇంగ్లీష్ లిటరేట్, హిందీ లిటరేట్ ఉర్దూలిటరే చర్ లో అడ్మిషన్లు పొందవచ్చని పేర్కొన్నారు. ఆయా కోర్సులలో చేరేందుకు దరఖాస్తులకు చివరి తేదీ ఆగస్టు 13 అని ఆయన తెలిపారు. ఇతర వివరాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వెబ్సైట్ డబ్ల్యు డబ్ల్యు డాట్ బి ఆర్ ఏ ఓ యు ఏసీ డాట్ ఇన్ ను సంప్రదించాలని ఆయన కోరారు.















