ఈతరం భారతం హైద్రాబాద్ ఆగస్ట్ 23;
అక్టోబర్ లో లోక్ సత్తాపార్టీ 20వ వార్షికోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాసులు తెలిపిపారు.ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా దేశంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టడమే గాక ప్రజాస్వామ్య సంస్కరణలకై పోరాటం చేసిన ఏకైక సంస్థ లోక్ సత్తా అని జీసన పేర్కొన్నారు.గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి దాకా పార్టీ నిర్మాణం చేపట్టి ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యువత GenZ ఆశలకు, ఆశయాలకు, గొంతులకి లోక్ సత్తా వేదికగా పార్టీని నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇంకా ఈ సమావేశంలో బందా విజయ్, లోహిత్, శివరామ కృష్ణ, రంగా చారి, వెంకట్, శ్రీధర్, కర్నె విజయ్, అర్జున్ రావు, బోనాల ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు .















